నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని పశువైద్య అధికారి వడ్యారవి మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపక పథకం గురించి ఆయన వివరించారు. మొదటి పథకంలో ఏడు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని ఒక్కొక్క యూనిట్కు 45 కోడి పిల్లలు ఇవ్వబడుతుందని ఒక యూనిట్ వాటర్ 3330 రూపాయలు కాగా లబ్ధిదారులు 1080రూపాయలు చెల్లించి తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే రెండో రకం యూనిట్ లో21 యూనిట్లు అందుబాటులో ఉన్నాయని ఒక్కక్క యూనిట్కు 25 కోడి పిల్లలు ఇవ్వబడుతుందని యూనిట్ ద్వారా 1800 కాగా లబ్ధిదారుడు 600 చెల్లించి తీసుకోవాలని ఆయన సూచించారు మహిళా సంఘాలలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm