- సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపు
నవతెలంగాణ- కంటేశ్వర్
డిసెంబర్ 8న ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు నిజామాబాద్ జిల్లా నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆషా వర్కర్స్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పిహెచ్సి స్థాయి నుండి ఆలిండియా స్థాయి వరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నిజామాబాద్ జిల్లా 4వ మహాసభలు 2022 డిసెంబర్ 8 న జిల్లా కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో జరుగబోతున్నాయి.
ఈ మహాసభలో గత కార్యక్రమాలు సమీక్షించి, ప్రస్తుతం ఆశాల పట్ల, పేద ప్రజల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చర్చిస్తాము. ఆశా వర్కర్లు ఎందుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ, పోరాటాలు ఈ మహాసభ నిర్ణయం చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కల్గిన ఈ మహాసభలను జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ పిలుపునిస్తున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లకు సిఐటియు సంఘం పెట్టింది. ఆశాల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల ఫలితంగా పారితోషికాలు పెంపు, పిహెచ్సి సమావేశానికి టీఎ, డిఎ లు, రెండు జతల యూనిఫామ్స్. తదితర అనేక హక్కులు ఆశా వర్కర్లు సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం చెల్లించాలని 106 రోజులు సమ్మె చేశాము. ఫలితంగా ఆశా వర్కర్లకు రూ.3,000/-ల నుండి రూ.6,000. లకు పారితోషికాలు పెరిగాయి.
పారితోషికాల పద్ధతి వద్దని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ్న ఇస్తున్నట్లు ఫిక్స్డ్ వేతనం రూ. 10,000/-లు తెలంగాణాలో పని చేస్తున్న ఆషాలకు ఇక్కడి ప్రభుత్వం చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో సుదీర్ఘపోరాటాలు అనేకం చేశాము. ఫలితంగా 2017లో రూ.1500/-లు పారితోషికాలు పెరిగాయి. 2021 అసెంబ్లీ సమావేశాలలో ఆశాలకు 30% పిఆర్సి ని (2,250 పారితోషికాలు) ముఖ్యమంత్రిగారు ప్రకటించారు. స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాతనే ఆన్లైన్ పని చేయించాలని 2021 ఫిబ్రవరి నెలలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాము. ఫలితంగా రాష్ట్రంలోని ఆశాలందరికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు సప్లై చేసింది. కరోనా సమయంలో ఆశా వర్కర్లకు ఫిక్సిడ్ వేతనం - రూ.10,000/-లు చెల్లించాలని, ఈలోపు ఇచ్చే పారితోషికాలు తగ్గించకుండా చెల్లించాలని, మాస్కులు, శానిటైజర్లు, కరోనా ఇన్సెంటివ్ తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది. ఫలితంగా 2020 సెప్టెంబర్ 25న ప్రభుత్వం మన సంఘంతో జాయింట్ మీటింగ్ నిర్వహించి రూ.7,200/-లకు తగ్గించకుండా ప్రతి నెలా పారితోషికాలు చెల్లిస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ 8 న జరిగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా 4 వ మహాసభలో ఈ అంశాలను చర్చించి, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ ప పోరాటాలకు రూపకల్పన చేద్దాం. ఇంతటి ప్రాధాన్యతతో కూడుకున్న జిల్లా మహాసభలను జిల్లా ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజమణి, సిహెచ్ నర్స, బాలామణి, సుకన్య, స్వప్న, పద్మ, శాంతి, లావణ్య, సరోజ, చందన, పెద్ద సంఖ్యలో ఆశ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:17PM