నవతెలంగాణ-కంటేశ్వర్
ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు గోదావరిఖని పెద్దపల్లి జిల్లాలో జరిగే 68వ రాష్ట్రస్థాయి మహిళ పురుషుల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు ఎంపికైనటువంటి నిజామాబాద్ జిల్లా మహిళ క్రీడాకారులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ధర్మారం బి లో శిక్షణ శిబిరాన్ని శనివారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షులు మానస గణేష్ పాఠశాల ప్రిన్సిపల్ బి. సంగీత రీజినల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి.నీరజ గారు, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాట్మెంటన్ సంఘం సభ్యులు, కోశాధికారి రాజేశ్వర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్ ఠాగూర్, పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm