వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి గతంనుండి కోరుతూ వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వేంటనే పరిష్కరించాలని నిజామాబాద్ రూరల్ వికలాంగుల విభాగం కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో ఇందల్ వాయి మండల వీహెచ్పీఎస్ అధ్యక్షులు ఇమ్మడి సాయిలు, ఎన్పిఅర్డి అధ్యక్షులు ఎరుగు శ్రీనివాస్ లు అన్నారు. శనివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా రాష్ట్రంలో దివ్యాంగులు తమ హక్కుల సాధనకై వివిధ రకాలుగా ధర్నాలు నిర్వహించి డిమాండ్లను ప్రభుత్వానికి తెలుపడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా శుక్రవారం వికలాంగు సంక్షేమ శాఖను శిశు సంక్షేమ శాఖ నుంచి తొలగిస్తూ తాత్కాలికంగా జీవో విడుదల చేశారని, అందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే యదా విధిగా వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి మా డిమాండ్లను కూడా పరిష్కరించాలని పేర్కొన్నారు.తమ డిమాండ్ లో పరిష్కారానికి ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు వినతిపత్రం అందజేశామని, వారు ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చినట్లు దాని ఫలితమే ఈ ప్రకటన చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు. సోమవారం 5 న మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహిళ విభాగం అధ్యక్షురాలు అబ్బవ్వ, జమున, శ్రవణ్ గౌడ్, రమేష్, కుమ్మరి జామున ఇతర మండల ప్రతినిధులు పాల్గొన్నారు.