నవతెలంగాణ-కంటేశ్వర్
రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ ల్లో పనిచేస్తున్న టీచర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం టిపిటిఎఫ్ మూడుదశల పోరాటం లో భాగంగా, శనివారం(3-12-2022) హైదరాబాద్ లోని డీఎస్ ఈ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించడానికి వెళ్లిన వందలాది మంది కేజీబీవీ టీచర్లను, టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ ,జిల్లా కమిటీల నాయకులను విచక్షణా రహితంగా చెదరగొట్టి, మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిపిటిఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. రమణ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళుతెరిచి కేజీబీవీ ల్లో పనిచేస్తున్న టీచర్లను రెగ్యులర్ చేయాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, పని గంటల వెట్టిచాకిరి రద్దుచేయాలని, సమాన పనికి, సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm