నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో బిపి, షుగర్ మెడికల్ కిట్లను సర్పంచ్ సరీన్ శనివారం పంపిణీ చేశారు. గ్రామంలో 30 మంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేశారు. అలాగే 18 సంవత్సరాల నిండిన 25 మంది యువతీ,యువకుల ఓటు హక్కు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మోహన్, కారోబార్ భుజంగరావు మరియు వైద్య సిబ్బంది ఉన్నారు.