- ఎంపిఓ రాంకిషన్ రావు
నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రతి ఒక్కరు తమ ఇంటి పన్నులు సకాలంలో చేల్లించి గ్రామ అభివృద్ది కి తమవంతు సహకారం అందజేయాలని డిచ్ పల్లి మండల ఇంచార్జీ ఎంపిడిఓ రాం కిషన్ రావు అన్నారు. శనివారం మండలంలోని సుద్ద పల్లి గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ లో బాగంగా సర్పంచ్ పానుగంటి రూపా సతీష్ రెడ్డితో కలిసి ఇంటికి తిరుగుతూ ఇంటి పన్నులను 5వేల 600వందల రూపాయలు వసూలు చేయడం జరిగిందని ఎంపిఓ రాం కిషన్ రావు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో పేరుకు పోయిన ఇంటి పన్నులను వసూలు చేసి గ్రామ అభివృద్ది కి తమవంతు సహకారం అందజేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి వసుల్లు చేయాలని సూచించారు.అయన వేంట పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm