నవతెలంగాణ-నవీపేట్: మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో భగవద్గీత జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీమద్భగవద్గీత విశిష్టత తోపాటు విద్యార్థులకు 12 వ అధ్యాయం భక్తి యోగంలోని శ్లోకాలపై మరియు వకృత్వ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. గీత జయంతి ఆకారంలో చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ హన్మాన్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్, గంగారెడ్డి, సాయిరెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm