నవతెలంగాణ-డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి విద్యార్థి అమర వీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో శ్రీకాంత చారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్తి చిట్ల పాల్గొని మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారిని అందరు యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని సాధించడానికి ప్రాణాలు అర్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రాణాలు అర్పించిన ఎంతో మంది అమరవీరులను స్మరించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్, యూనివర్సిటీ అధ్యక్షులు శివ, ఇందూర్ విభాగ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్, ఇందూరు జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ ప్రమోద్, సింహాద్రి, గంగోలి, సోనియా, శ్రావ్య, మేఘన, యామిని తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:40PM