నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర లాబానా సంఘం అధ్యక్షుడు తన్ సింగ్ మాట్లాడుతూ మండలంలోని చర్మల్ తాండాలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 05/12/2022 నాడు జిల్లా స్థాయి సమావేశం గాంధారీ మండలంలోని చర్మంతాండాలో ఉదయం 11 గంటలకు నిర్వహించబడును. ఈ సమావేశానికి పరశురామ్ మహారాజ్, నాందేడ్ సంత్ శ్రీ గులాబ్ సింగ్ మహారాజ్, చంద్ర పూర్ సంత్ శ్రీమంగళ్ చంద్ మహారాజ్, బార్గి సంత్ శ్రీ రాంసింగ్, ఇంద్రవెల్లి మహారాజ్ సంత్ శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్, భూతై సంత్ శ్రీ దర్యవ్ సింగ్టెం, బి మహారాజ్ సంత్ శ్రీ సూరజ్ మహారాజ్, ఏమైకుంటా సరిచండ్ మహరాజ్, విచ్చేయు చున్నారు కావున సమస్త కామారెడ్డి జిల్లాలోని లవణ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయనకోరారు. ఈకార్యక్రమంలో బిర్మల్ తండా సర్పంచ్ గోతి దర్బార్, తిప్పారం తండా సర్పంచ్ బిషన్ నాయక్, రాతిరం తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:43PM