నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో గల మల్లన్న స్వామి ఆలయం వద్ద మల్లన్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాదవ సంఘ పెద్ద మనుషులు మాట్లాడుతూ 3 వ తేదీ శనివారం పల్లకి సేవ నిర్వహించామని, ఆదివారం బోనాలు, సోమవారం అన్నదానం, జాతర, మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు దున్నడం, నాగవెల్లి, ఎల్లమ్మ బోనాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని యాదవ సంఘ సభ్యులు కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm