- నిజామాబాద్ జిల్లాలోని గౌడ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీల దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కంటేశ్వర్
చట్టబద్ధతలేని విడీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలోని గౌడ యోజన సంఘం నాయకులు ఆందోళనకు దిగారు ఎన్టీఆర్ చౌరస్తాలోని గ్రామ అభివృద్ధి కమిటీల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గీత వృత్తిదారుల కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీలు ఇబ్బందులు పెడుతూ సామాజిక బహిష్కరణలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఆగడాలు శృతిమించుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు కూడా విడీసీలకు మద్దతుగా నిలుస్తున్నారని వీడిసి లపై కఠిన చర్యలు తీసుకొవలని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని గౌడ యువజన సంఘం నాయకులు నరేష్ గౌడ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని గౌడ యోజన సంఘం నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:56PM