నవతెలంగాణ-డిచ్ పల్లి
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కాసోజి శ్రీకాంత్ చారి 2009లో ఎల్బీనగర్ అంబేద్కర్ చౌరస్తాలో జై తెలంగాణ అంటూ తనపై పెట్రోల్ పోసుకొని ఐదు రోజులపాటు చికిత్స పొందుతూ అమరుడైన శ్రీకాంత్ చారి తెలంగాణ రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలిచాడని తెలంగాణ యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు దినేష్ మాదిగ అన్నారు. శనివారం శ్రీకాంతాచారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కాసోజి శ్రీకాంత్ చారి 2009లో ఎల్బీనగర్ అంబేద్కర్ చౌరస్తాలో జై తెలంగాణ అంటూ తనపై పెట్రోల్ పోసుకొని ఐదు రోజులపాటు చికిత్స పొందుతూ అమరుడైన శ్రీకాంత్ చారి తెలంగాణ రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. కార్యక్రమంలో రమణ ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm