నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని డోంగ్లి నూతన మండలంగా ఏర్పాటు కావడం ఆ నూతన మండలాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు సభకు మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డోంగ్లి గ్రామ సభకు భారీగా తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ డోంగ్లి నూతన మండలంగా ఏర్పాటు కావడం ఆ మండల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రావడం పట్ల మద్నూర్ మండలానికి పలు అభివృద్ధి పనులు మంజూరు అయ్యే అవకాశం ఉన్నాయని తెలిపారు. తరలి వెళ్లిన వారిలో ఉప సర్పంచ్ విట్టల్ టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సంతోష్ మేస్త్రి, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి సంగీత కుశాల్ వడ్ల గోపి టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంచిన్ హనుమాన్లు రైతు సమన్వయ సమితి కన్వీనర్ ఉష్కల్, సురేష్ వీరితో పాటు మైనార్టీ నాయకులు అక్తేర్ బాబు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 06:12PM