- మండల తాసిల్దారుగా క్రాంతి కుమార్
నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఆ గ్రామంలోని రైతు వేదిక భవనంలో తాసిల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఆ మండల తాసిల్దారుగా క్రాంతి కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త మండలంలో మొట్టమొదట తాసిల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం ప్రారంభించారు. ఈ మండల తాసిల్దారుగా క్రాంతి కుమార్ రెవిన్యూ ఇనిస్పెక్టర్గా దీపక్ రాజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గా మహమ్మద్ ను నియమించారు. ఈ ముగ్గురు అధికారులతో నూతన తాసిల్దార్ కార్యాలయం డోంగ్లి మండలంగా కొనసాగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm