నవతెలంగాణ-మద్నూర్
కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటు అందిస్తోందని బోర్ల వద్ద మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఒత్తిడి తెస్తుందని మీటర్లు పెట్టకపోవడంతో 12 వేల కోట్ల నిధులు నిలిపివేసిందని బోర్ల వద్ద మీటర్లు పెడితే 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బోర్ల వద్ద కరెంటు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయదారులకు 24 గంటలు ఉచిత కరెంటు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు తెలిపారు. మద్నూర్ మండలంలోని డోంగ్లి కొత్త మండలం ఏర్పాటు ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర మంత్రి హరీష్ రావు శనివారం తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దిక్సూచి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీలు కొడుతుందని మన రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టగా దానిని కేంద్ర ప్రభుత్వం గరుగరుకుజల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టగా అలాంటి పథకాన్ని కాపీ కొడుతూ అమృత్ సరోవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుక వస్తుందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి భూముల విషయంలో అన్యాయాలు జరగకుండా రికార్డుల్లో తప్పులు జరగకుండా ధరణి పథకం ప్రవేశపెట్టగా తెలివి లేని వారు ధరణి గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ధరణి పథకం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా అవినీతి పాలనకు చెక్ పెడుతూ పట్టా పాస్ పుస్తకాలు ఇంటికే అందించడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు తారుమారు కావడానికి అవకాశం లేదని పారదర్శకమైన వేగవంతంగా ఈ పథకం కొనసాగుతుందని ఇలాంటి పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలన శ్రీరామరక్షగా కొనసాగుతుందని కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను చూసి పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని డిమాండ్ వస్తుందని పేర్కొన్నారు.
దేశంలో గల ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాల పట్ల మన వైపు చూస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు పథకం రైతు బీమా పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 2016,3016, ప్రతి నెల నెల అందించే పథకం ఇలాంటి పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారాయని ఇలాంటి పథకాల పట్ల దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాల పట్ల ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం వాటితో పాటు డివిజన్ కేంద్రాలు మండల ఏర్పాటు ప్రజలకు పరిపాలన దగ్గర చేయడమే కేసీఆర్ ప్రభుత్వ దయమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని హామీలు ఏమయ్యా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మండలాల సంఖ్య 466 ఉండగా వాటికి 612 కు చేర్చడం జరిగిందని కొత్త మండలాలతో ప్రజలకు పాలన దగ్గర చేశామని తెలిపారు జుక్కల్ లో వివిధ మండలాల్లో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల మంజూరు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మంజూరు కావడానికి కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
జుక్కల అభివృద్ధికి ఎమ్మెల్యే హనుమంతు సిండే ఎంపీ బీబీ పాటిల్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం లో నాగమడుగు ఎత్తిపోతల పథకానికి 476 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఇది పూర్తయితే 40000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అంతర్రాష్ట్ర లేండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రకు వెళ్లి తెలంగాణ వాటా చెల్లించడానికి సిద్ధమైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి 2250 కోట్లు ఖర్చయ్యేదానికి మన రాష్ట్ర వాటా 750 కోట్లు చెల్లించవలసి ఉన్నప్పటికీ దాంట్లో 200 కోట్లు చెల్లించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందించలేక పోతున్నామని దీనికి బదులు మంజీరా నదిలో 190 కోట్లతో చెక్ డ్యాములు నిర్మిస్తే లేండి కాలువల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు.
వీటితో నియోజకవర్గంలోని పాలు మండలాలకు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మంత్రికి వినపత్రాలు అందజేశారు ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ముఖ్యంగా రోడ్ల అభివృద్ధికి అనేక కృషి చేయడం మూలంగా గ్రామ గ్రామానికి రోడ్ల అభివృద్ధి జరుగుతుందని మద్నూర్ మండలానికి కేంద్రీయ విద్యాలయం మంజూరులో జాప్యం జరిగిందని దానిని మంత్రి హరీష్ రావు కృషితో త్వరలో మంజూరు చేసి ప్రారంభింప చేస్తామని తెలిపారు. దేశంలోనే కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిన వాటికి కేంద్రం నుండి ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తో పాటు ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే జెడ్పి చైర్మన్ ఎమ్మెల్సీ గౌడ్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వాగుమారే లక్ష్మీబాయి, మండల జెడ్పిటిసి సభ్యురాలు అనిత కథలయ్య, డోంగ్లి సర్పంచ్ మాధవి, శశాంక్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు జడ్పిటిసిలు పార్టీ నాయకులు ఆయా మండలాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 06:38PM