నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ కార్యాలయంలోని నూతనంగా నిర్మించినటువంటి డిఆర్ఓ కార్యాలయం తోపాటు పలు కార్యాలయాలను శనివారం భారీ బందోబస్తు నడుమ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సమక్షంలో భవనాలను కుల్చారు. భవనాలను కూల్చేటప్పుడు ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు తదితకుండా అక్కడే అగ్నిమాపక శాఖ వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ఇంకా హడావిడిగా కూల్చడంపై ప్రజలు అసలు నిజామాబాద్ జిల్లాకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి కట్టడాలు ఉన్నాయని అందులో ప్రగతి భవన్ కలెక్టరేట్ తో పటు నూతనంగా కట్టిన భవనాలను కూల్చడం సరైన పద్ధతి కాదని స్థానికులు ప్రజలు వాపోతున్నారు. ఎన్ని ఖర్చులు వెచ్చించి కట్టి ఇప్పుడు కులగొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేని పరిస్థితులలో ఉన్నాము అని అనుకుంటున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చినప్పుడు పాత కలెక్టరేట్ కార్యాలయాన్ని కళాభారతి నిర్మించడానికి కేటాయించారు అయితే అందుకోసం పనులను వేగవంతం చేశారా లేక మరి ఇంకేమైనా లాభవేక్షణ కోసం పనులను వేగవంతం చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.
ఆఫీసర్స్ క్లబ్ ను కూల్చోద్దని ఆఫీసర్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని గురువారం పాత కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది అందుకోసం ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు తదితరులు కలిసి కలెక్టర్ తో మాట్లాడుతున్న దృశ్యాలు సైతం నవ తెలంగాణకు చిక్కాయి. అనంతరం అక్కడి నుండి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి వెళ్లిపోగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అక్కడే ఉండి పర్యవేక్షించారు వీటికి సంబంధించిన రిపోర్టును ఎప్పటికప్పుడు సీఎం ఓ కార్యాలయానికి అందజేసినట్లు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 06:42PM