నవతెలంగాణ-ఏర్గట్ల
తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా,సీఎం కేసీఆర్ పంపిన ఎన్సీడి కిట్ లను శనివారం ప్రభుత్వాస్పత్రి వారు ఏర్గట్ల, దోంచంద గ్రామాల ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుల్లే లావణ్య గంగాధర్, గద్దె రాధ గంగారాం,ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ అధ్యక్షులు పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm