- కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని తారకరామా కాలనీకి చెందిన నునవత సోమమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం వారి కుటుంబాన్ని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సోమమ్మ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల నగదు తో పాటు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, జెట్టి సోమయ్య, పెండెం శ్రీకాంత్, జంపాల చంద్రశేఖర్, కుర్సం కన్నయ్య, మాజిత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm