- రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన పలు కుటుంబాలు
- ఎంపీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ప్రజలు
నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని పెద్ద పెండ్యాల గ్రామంలో శనివారం పలువురు రోడ్డుపై బైఠాయించి మండల ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనను చేశారు. గ్రామానికి చెందిన నిరుపేద 6 కుటుంబాల ఇండ్లను అసైన్డ్ భూమి లో ఉన్నాయంటూ ఎంపీపీ తమకు నోటీసులు ఇప్పించిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు రోడ్డుమీద బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాల నుంచి తమ పూర్వీకులు ఇట్టి స్థలంలో నివాసం ఏర్పరచుకొని ఉంటుండగా ఇప్పుడు తాము సైతం ఇక్కడే ఉంటూ గ్రామపంచాయతీకి క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నామని అన్నారు.
కానీ ఇప్పుడు అట్టి భూమిని అసైన్డ్ భూమి అంటూ ప్రభుత్వ అధికారుల ద్వారా ఎంపీపీ నోటీసులను పంపించి కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా పలువురు ప్రజా ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి సంఘీభావం ను తెలిపారు.ఎవరి ఇల్లులు ఎక్కడికి పోవు స్పష్టం చేసిన ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి ఎవరి ఇల్లులు ఎక్కడికి పోవని కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నారని ఎంపీపీ నిమ్మకవితారెడ్డి స్పష్టం చేశారు.
వారి ఉచ్చులో చిక్కుకొని ఎవరు భయభ్రాంతులకు గురికావలసిన అవసరం లేదని, తాను కావాలని నోటీసులు ఇప్పించానని అన్న మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని తెలిపారు. మహిళా భవనాల నిర్మాణానికి కొంత స్థలం కావాలని అధికారులు కోరగా సదరు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉన్నది అని చెప్పడం జరిగింది అని, 8 గుంటలు ఉండగా 2గుంటలు మాత్రమే ఎమ్మార్వో సర్వేచేసి మహిళ భవనానికి కేటాయించడం జరిగింది తప్పితే ఉన్న ఇండ్లను ఖాళీ చేయించమని తాను చెప్పలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రజలను ఉపయోగించుకుని ఇట్టి నీచమైన కుట్రలను చేయడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 07:06PM