నవతెలంగాణ-అశ్వారావుపేట
ఓటు నమోదు ప్రత్యేక శిబిరంలో మొదటి రోజు శనివారం నియోజక వర్గం వ్యాప్తంగా (అయిదు మండలాలు) 187 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1091 దరఖాస్తులు అందాయని డి.టి సుచిత్ర తెలిపారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఓటు నమోదు ప్రత్యేక శిబిరాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ములకలపల్లి 329, చండ్రగొండ 82, అన్నపురెడ్డిపల్లి 41, దమ్మపేట 369, అశ్వారావుపేట 370 దరఖాస్తులు అందాయన్నారు.
ఫార్మ్స్ వారీగా ఫాం 6 - 843, ఫాం 6బి - 15, ఫాం 7 - 178, ఫాం 8 - 70 చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm