నవతెలంగాణ-రాజంపేట్
రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం కామారెడ్డి ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి మరియు రాజంపేట ఎమ్మార్వో జానకి సందర్శించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల అతి తక్కువ సమయంలోనే కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరిచి రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారనికి ఎన్నిక కావడం గర్వకారణమని నిజంగానే పాఠశాల చాలా స్వచ్ఛంగా ఉందని ఎస్ఎంసి చైర్మన్ అంకం శ్యామ్ రావును, పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులను అభినందిస్తున్నానని అన్నారు.
ఈ ఆరేపల్లి పాఠశాలకు కార్పొరేటు స్కూలుకు ధీటుగా 9 గ్రామాల విద్యార్థులు రావడం మరియు గతంలో 12 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతము 208 మంది విద్యార్థుల సంఖ్య పెరగడం అభినందిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అనురాధ, రేఖ, విద్యా వాలంటరీలు, మాధురి, భాగ్య, అశ్విని, అమల, రెవెన్యూ సిబ్బంది సిద్ధ రాములు, అంగన్వాడి టీచర్ స్వరూప, పాఠశాల సిబ్బంది సంజువ్, శ్యామల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 07:16PM