- ఆకట్టుకున్న వ్యవసాయ సామాగ్రి ప్రదర్శన
నవతెలంగాణ-అశ్వారావుపేట
భారత వ్యవసాయ శాఖ ప్రధమ మంత్రి,పూర్వ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జన్మదినం అయిన డిసెంబర్ 3 ను పురష్కరించుకుని ఐకార్ (ఐసిఎఆర్) నిర్వహించే జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని శనివారం స్థానిక వ్యవసాయ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాల నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్య, వ్యవసాయ రంగంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సామాగ్రితో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కళాశాల ఇంచార్జి ఎ.డి డాక్టర్ వెంకన్న ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రైవేట్, ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ విజ్ఞాన మరియు సాంకేతిక నైపుణ్యాన్ని తెలిపే నమూనాలు, ప్రత్యక్ష ప్రదర్శనలను వీక్షించి వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, భారత దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగం యొక్క కీలక పాత్ర గురించి వివరించారు.
ఈ ప్రదర్శనలో ముఖ్యంగా హైడ్రోఫోనిక్స్,వానపాముల ఎరువు తయారి, జీవన ఎరువుల తయారి, పుట్టగొడుగుల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, వ్యవసాయ పనిముట్లు వాటి ఉపయోగాలు,మట్టి నమూనా పరీక్ష కెట్స్, బిందుసేద్యం తుంపరల సేద్యం,ఏ పంటల విత్తన రకాలు,వ్యవసాయ విస్తరణ ఒ భాగంగా గ్రామీణ సంచలనత్మాక బాగస్వామ్యం, నమునా, ప్రదర్శించారు. వ్యవసాయ ప్రదర్శనలు వీక్షించటానికి ప్రభుత్వపాఠశాల, కళాశాలలు, డిగ్రీ కళాశాల విద్యార్థలు, ప్రైవేట్ పాఠశాలలు జవహర్, గౌతమి, సూర్య పబ్లిక్ కళాశాల, పూజ్య శ్రీ మాధవన్ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులు సుమారు 1300 మంది వీక్షించారు.
ఈ కార్యక్రమాన్ని ఒఎస్ఎ డా. యస్.మధుసూదన్ రెడ్డి,ఎన్.ఎస్.ఎస్ పిఓ డాక్టర్ కాడా సిద్దప్ప,ఆర్.రమేశ్,కె. శిరీష సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గోపాల కృష్ణమూర్తి,ఎమ్. రామ్ ప్రసాద్,కోటేశ్వరరావు, కృష్ణ తేజ,పి. నీలిమ, పి.శ్రీలత, పి. రెడ్డిప్రియ, దీపక్ రెడ్డి, ఆర్. కుమార్, కళాశాల బోధనేతర సిబ్బంది కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 07:20PM