నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్ధులతో వెళ్తున్న బస్సు బోల్తా పడ్డప్పటికీ స్వల్పగాయాలతో అందరు క్షేమంగా బయటపడ్డారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన గీతం కళాశాల విద్యార్ధులు ఆంధ్రా లోని కడియం విహార యాత్రకు అశ్వారావుపేట మీదుగా ఓ ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సులో శనివారం ప్రయాణిస్తున్నారు. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో మొత్తం సిబ్బందితో 45 మంది ఉన్నారు. సుమారు 15 లోపు విద్యార్ధులు స్వల్ప గాయాలు అయినట్లు సంఘటనా స్థలానికి చేరిన ఎస్.ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు. యాజమాన్యం నుండి పిర్యాదు అందలేదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm