నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని విద్యా శాఖ మండల విద్యా వనరుల కేంద్రం ఆద్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. తదనంతరం మండలంలోని దివ్యాంగుల పిల్లలకు క్రీడలు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యుక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి, డిప్యుటీ తహాసిల్దార్ సుచిత్ర, క్రీడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో వారు మాట్లాడుతు వైకల్యం అనేది శారీరానికే గానీ మనస్సుకు కాదు, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకొవచ్చు. ఎందరో దివ్యాంగులు దేశంలో జిల్లా కలెక్టర్ లు రానిస్తున్నారు అని. (కేరళ - తిరువనంలుపురం సబ్ కలెక్టర్ తొలి అంథ మహిళ ప్రాంజల్ పోటిల్) ప్రభుత్వం నుండి దివ్యాంగులకు ఉపకారగాలు, ఇతర ప్రభుత్వ పథకాలు, మంచి విద్యను ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు. బహుమతులను జవహర్ విద్యాలయ చైర్మన్ రామారావు పేరున వారి బంధువులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు నరసిం హారావు, ఉపాద్యాయులు, మండల విద్యా శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 07:35PM