నవతెలంగాణ-నవీపేట్
రోడ్డుపై నిర్లక్ష్యంగా ధాన్యం ఆరబెట్టి ఒకరి మృతికి కారణమైన రైతుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవీపేట్ మండలంలోని గాంధీ నగర్ సమీపంలో హనుమాన్ ఫారం కు చెందిన రైతు రేమల లక్ష్మ రెడ్డి నిరంతరం వాహనాలు నడిచే రోడ్డుపై అజాగ్రత్తగా సగం రోడ్డు వరకు ధాన్యం కుప్ప పోసి దానిపై నల్లటి తాటిపత్రి కప్పి చుట్టూ బండరాళ్లు వేయడంతో రాత్రి సమయంలో మహారాష్ట్ర యాతాలం గ్రామానికి చెందిన పండరి లాలు తన భార్యతో కలిసి జన్నేపల్లి నుండి తిరుగు ప్రయాణంలో నల్లటి తాటిపత్రి కనిపించకపోవడంతో వడ్ల కుప్పను ఢీకొని అక్కడికక్కడే మరణించగా అతని భార్య ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ప్రమాదానికి కారణమైన రైతుపై హత్యాయత్నం లాంటి సెక్షన్ లైనా 304(ii), 33IPC కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు రోడ్లపై నిర్లక్ష్యంగా ధాన్యం వేస్తే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ నరహరి ఎస్సై రాజారెడ్డి, సిబ్బంది రాజు, వసంత్ లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 02:41PM