నవతెలంగాణ-కంటేశ్వర్
ఎవరైన ఆకతాయిలు విధ్యార్థులను మహిళలను వేధింపులకు గురి చేసినట్లయితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్.నాగరాజు, ఐ.పి.యస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోగల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ యందు షీ టీం బృందాలను నిఘా ఉంచామని ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురి చేసినట్లయితే షీ టీం సెల్ నెంబర్ :87126-59795 గాని లేదా డయల్ 100 గాని ఫోన్ చేసి తెలియజేయగలరని పేర్కొన్నారు. ప్రస్తుతశీ అనగా తేది:01-11-2022 నుండి తేది: 30-11-2022 వరకు నిజామాబాద్ కమిషనరేట్ లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోగల షీ టీమ్స్ ద్వారా పట్టుబడిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాదులో జరిగిన సంఘటనలు 03, ఆర్మూర్ లో 03, కూడా అదే బోధనలో 02, మొత్తం సంఘటనలు 8 ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలలో మొత్తం పట్టుబడిన వారు నిజామాబాదులో- 05, ఆర్మూర్ లో- 03, బోధన్ లో -03 మొత్తం 11 మంది పట్టుకున్నారు. పెట్టిన కేసులు నిజామాబాద్ లో లేవూ. ఆర్మూర్ - 2 , బోధన్ - 2 , మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాలేవు.కౌన్సిలింగ్ చేయబడిన వారు నిజామాబాదులో 05, ఆర్మూర్ లోొ01, బోధన్ లో లేరు మొత్తం 06 గురికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 02:45PM