నవతెలంగాణ- వీణవంక
కనపర్తి గ్రామపంచాయతీ నూతన భవనానికి రూ. 20 లక్షలు మంజూరు కాగా సర్పంచ్ పర్లపల్లి రమేష్, ఎంపీటీసీ మోరే స్వామి, ఉప సర్పంచ్ అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి కలిసి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు నూతన భవనాల నిర్మాణం సిసి రోడ్లు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటాయని వారన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట సర్పంచ్ ముత్తయ్య,
మాజీ సర్పంచులు వెంకటేష్, మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు కర్ణ తిరుపతి, అడిగొప్పుల అశోక్, రమేష్, బంగారి సారయ్య, బంగారి సంధ్య, కాంతాల లావణ్య, పంజాల పుష్ప, ఎల్కపల్లి నిర్మల, పులి స్రవంతి, నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 02:49PM