నవతెలంగాణ-కంటేశ్వర్
ఈ.జె.హెచ్.ఎస్ పరిధిలోని వెల్ నెస్ సెంటర్ ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని నాలుగవ అంతస్థులోకి మార్చటం సరైనది కాదని ఆదివారం మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవనంలో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు, ఉద్యోగులకు, జర్నలిస్టులకు, వారిపై ఆధారపడ్డ వారికి, వయోవృద్ధులకు, వికలాంగులకు, ఇబ్బందికరంగా ఉంటుంది.
సాధారణంగా ఆస్పత్రిలోని లిఫ్టులు పనిచేయవు. నాలుగు అంతస్తులు ఎక్కి వైద్య సేవలు, మందులు పొందటం సాధ్యం కాదు. అందు వలన వెల్నెస్ సెంటర్ను ప్రభుత్వ వైద్య కళాశాల వెనుక నున్నపాత డిఎంహెచ్వో కార్యాలయంలోకి, లేదా వైద్య కళాశాల ప్రవేశ ద్వారము పక్కనున్న టీబి సెంటర్ పాతభవనంలో కి మార్చాలని వెల్నెస్ వెల్ఫేర్ కమిటీ కలెక్టర్ కి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు రామ్మోహన్రావు, ఎల్ శ్రీధర్, మట్ట జార్జి ,కేసీ లింగం, భాస్కర్, పురుషోత్తం, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్నెస్ సెంటర్ వెల్ఫేర్ కమిటీని వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 04:05PM