నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల టి.ఎస్.ఆర్.టి.సి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో లహరి ఇంటర్నేషనల్ హోటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ పెట్టుబడులకు స్వర్గధామంగా నిజామాబాద్ నగరం అని అన్నారు. శాంతి భద్రతలు భేష్-నగరానికి క్యూ కడుతున్న కంపెనీలు అని తెలిపారు. నిజామాబాద్ నగరం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈ రోజు హైదరాబాద్ బైపాస్ రోడ్డులో లహరి ఇంటర్నేషనల్ హోటల్ ని ప్రారంభించడం జరిగింది. నగర ప్రజలకి సరి కొత్త రుచులు-మంచి సేవలు అందించాలని కోరుతున్నాను.
నిజామాబాద్ నగరం సురక్షితం కావడం వల్ల అనేక ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇంటర్నేషనల్ హోటల్స్,జ్యూవెల్లరి షో రూమ్స్, ఐడి ట్రైనింగ్ కంపెనీ, షాపింగ్ మాల్స్ లు నగరం లో ఏర్పాటు అయ్యాయి. ఈ సంస్థల వల్ల స్థానిక యువత ఉపాధి పొందుతున్నారు. ప్రైవేట్ వ్యాపార సంస్థలకి స్వాగతం పలుకుతున్నాము. వారు పెట్టు బడులు పెట్టి స్థానిక యువతకి ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మేనేజ్మెంట్ తిరుపతి రెడ్డి టిఆర్ఎస్ కార్పొరేటర్ లు/నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 04:09PM