నవతెలంగాణ-మంథని
మంథనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అభ్యాసకుల అధ్యయన కేంద్రంలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థాపించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.భారత్ అధ్యతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.సాయిరామ్, విద్యావేత్త.భోగే చంద్రశేఖర్ ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ అభ్యాసకుల అధ్యయన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యయన కేంద్రం సిబ్బంది సిహెచ్.రాజు,డి. సురేష్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm