నవతెలంగాణ-మంథని
మంథని మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనాల విరుద్ధంగా కొనసాగుతున్నాయని రిటైర్డ్ టీచర్ మాడిశెట్టి శ్యాంసుందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల యొక్క పూర్తి వివరాల కోసం ఆర్టిఐ ద్వారా సంబంధిత ఎంఈఓ, డిఈఓ, ఆర్.జెడి, ఎస్ ఈ వరంగల్, సిడిఎస్ఈ టీఎస్ హైదరాబాద్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు సమాచారం ఇవ్వటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా నిబంధనాలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాల ముందు కొనసాగుతున్న ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ టీచర్ మాడిశెట్టి శ్యాంసుందర్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm