నవతెలంగాణ-మంథని
మంథని మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఏరియా,ప్రధాన రహదారులు, 2వ, 12వ వార్డులలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ వార్డు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆమె ప్రజలకు తెలిపారు. అనంతరం మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పరిసరాల పరిశుభ్రత, చెత్త చేదరాల తొలగింపు పనులను దగ్గరుండి చేపించారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, కౌన్సిలర్లు గుండా విజయలక్ష్మీ-పాపారావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm