- నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో
నవతెలంగాణ-కంటేశ్వర్
నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పెద్ద రాం మందిరం ఆవరణలో గల ఆలయ పుష్కరిణి ని( కోనేరు ) శుభ్రం చేయడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు ఇలా పూర్తిగా మురికికూపంలా మారిన ఆ కొనేరును గంట పాటు శ్రమించి ఒక ట్రాక్టర్ నిండా చెత్తను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోనేరు ఈ స్థితిలో ఉండటానికి మనమే కారణమని కాబట్టి ఇక నుంచైనా మనం చెత్తను చెత్త కుండీల్లోనే వెయ్యాలని, ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ కోసం వినియోగించడానికి మున్సిపాలిటీ సూచించిన విధంగానే వేరు చేయాలని కోరారు.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మేము చేయగలిగిన ప్రయత్నాన్ని చేస్తున్నానమని దీనికి స్థానిక యువత, ప్రజల సహకారం కావాలని కోరారు. ప్రతీ వారం ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 04:49PM