నవతెలంగాణ-మంథని
మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో శనివారం నాడు ప్రమాదానికి గురైన అంబేద్కర్ సంఘం నాయకులు, రైతు, జంజెర్ల స్వామి కుటుంబాన్ని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఎరుకల ప్రవీణ్, ఆర్ల నాగరాజు, ఎరుకల సురేష్, రేపాక శ్రీనివాస్, పుష్పమల్లేష్, ఎరుకల.రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm