నవతెలంగాణ-కంటేశ్వర్
ప్రపంచంలో అన్ని మతాల వారిని ప్రేమించుమని చెప్పిన ఏకైక సుమగ్రంథం, ఘుక్తి గీత భగవద్గీత అని నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ అన్నారు. ఆదివారం రైల్వే స్టేషన్ రోడ్డు అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి గీత భవనం ఆధ్వర్యంలో గీత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమనికి ముఖ్య అతిథి గా హజరైనా మేయర్ మాట్లాడుతూ ద్వాపర యుగంలో కురు క్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్యా భగవద్గీత అని యుగాంతం మోక్షాన్ని పొందలంటే ప్రతి ఒక్కరూ విధిగా గీత పారాయణం చేయాలన్నారు .
సర్వమతాల సారం భగవద్గీత అని ప్రముఖ ధార్మిక వేత్త భగవద్గీతను ఉర్దూ భాషలోకి అనువదించిన హిభా ఫాతిమ అన్నారు. ఈ కార్య క్రమానికి ఆత్మీయ అతిథిగా హాజరైన ఫాతిమ సుదీర్ఘ ప్రసంగం లో భగవద్గీతలోని పలు అధ్యాయల్లోని 21 శ్లోక భావాలను చదివి వినిపించారు. 5155 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి రోజున అందించారని వివరించారు. కార్యక్రమ సమన్వయ కర్త వేద పండితులు బ్రహ్మ శ్రీ జనగామ చంద్రశేఖర శర్మ గీత భవనం ప్రధాన కార్యదర్శి మేడిచర్ల ప్రభాకర రావు, న్యాయ సలహాదారులు శ్రీహరి కోశాధికారి ఆరెట్టి లక్ష్మీ నారాయణ, వెంకట స్వామి నరేంధర్ రావు షిండే బొడ్డు దయనంద్ జిఎం శంకర్ సేర్ల దయనంద్ తదితరులు పాల్గొన్నారు. కుమారి సమన్విత. ఫాతిమలను గీత భవనం ప్రతినిధులు, నగర మేయర్ అభినందన పురస్కారం అందించిసన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంచామృత అభిషేకం, గీత యజ్ఞంలో మేయర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 05:05PM