నవతెలంగాణ-కంటేశ్వర్
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అకాల మరణం పొందిన జర్నలిస్టు నవీన్ నాయక్ మొదటి వర్ధంతి సందర్భంగా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో రెండు జట్లు పోటీపడ్డాయి. ఇందులో వి6 కెమెరామెన్ రాజేష్ కెప్టెన్సీ చేసిన టీం విజయం సాధించింది. శ్రీకాంత్ టీం రన్నర్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వి6 వీడియో జర్నలిస్ట్ రాజేష్ జట్టు 16 ఓవర్లలో 121 పరుగులు చేయగా, శ్రీకాంత్ జట్టు 105 పరుగులు చేసింది. 17 పరుగుల తేడాతో వి6 రాజేష్ టీం విజయం సాధించింది.
జర్నలిస్టులంతా క్రీడాస్ఫూర్తితో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. వారందరికీ కుటుంబ సభ్యులైన వి6 ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రజనీకాంత్ ఈ క్రీడలను కుటుంబసభ్యులతో ప్రారంభించారు. విజేతలకు త్వరలో బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ సమయాన్ని ఒక వారం రోజులు పెద్ద ఎత్తున ముగింపు సభ పెట్టుకుందాం. జర్నలిస్ట్ నవీన్ మా కుటుంబ సభ్యుడితోపాటు తోటి జర్నలిస్టులు ఆత్మీయులు, అన్నదమ్ములు నవీన్ ఆత్మకు శాంతి చేకూరిలోని కోరుకుంటున్నాం అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 05:08PM