- చింతలపూడి భాస్కర్ రెడ్డి బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ లవి అన్ని దివాలా కోరు రాజకీయాలు అని బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పసర పిఎస్ఆర్ గార్డెన్లో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం బిజెపి మండల అధ్యక్షుడు మద్దినేని తేజరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలోని 35 బూతు కమిటీలకు అన్ని కమిటీలలో 22 మందితో పూర్తి చేయాలని, అన్నారు. తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడం తద్యమని అన్నారు. ములుగు నియోజకవర్గంలో సీతక్క చేసింది. ఏమి లేదని, బస్సు డిపో గురించి ప్రస్తావించకుండా, బస్టాండ్ గురించి చుట్టు ఉన్న పరిసరాల గురించి ప్రస్తావించడం. దివాలుకొరు రాజకీయానికి నిదర్శనం. అన్నారు. బస్ డిపో పేరిట ఇటు ములుగు ప్రజలను, అటు ఏటూర్ నాగారం ప్రజలను సీతక్క మోసం చేస్తుందని అన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లా అన్నిటిలో వెనుకబడినదని, ఏ రోజు దాని గురించి ప్రస్తావించకుండా, చోద్యం చూస్తుందన్నారు. మండలంలోని సమస్యలకు ప్రజలతో మమేకమై, పోరాడాలని అన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నయం బిజెపి పార్టీ ఏ అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని.లక్నవరం చెరువు కాలువలకు గండ్లు పడి నీరు వృధాగా పోయి ప్రస్తుతం 32 ఫీట్లు ఉన్న నీటితో నాలుగు కాలువలు యాసంగవుతాయి. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం. అధికారుల నిర్లక్ష్యంతో రెండు కాలువలకే యాసంగికి నీరుస్తున్నారన్నారు .
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాల అవుతున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా లక్నవరం చెరువుకు ఖర్చు పెట్టలేదని తీర్మానించారు. పోడుభూమి వ్యవసాయం చేసుకునే రైతులకు పట్టేదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని, మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి అంతర్గతంగా లింక్ రోడ్లను నిర్మించాలని, గుండ్ల వాగు కింద సాగు రైతులకు కాలువల మరమ్మతులను వెంటనే చేయాలని, చెరువు కింద భూమి నష్టపోయిన వారికి నష్టపరిహారం వెంబటే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి చౌగాని స్వప్న, కర్ర సాంబశివారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి, ఎస్టి మోర్చా ఉపాధ్యక్షుడు ఇక జగ్గారావు, మెరుగు సత్యనారాయణ, గట్ల రాజు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అంతిరెడ్డి రామ, అంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మండల ఉపాధ్యక్షులు బూర్గుల చంద్రమౌళి, కందాల వెంకటరెడ్డి, చలసాని ప్రవిన్న్,పశువుల బాబురావు, బర్ల సంజీవరెడ్డి, కంచర్ల చంద్రశేఖర్, ఏ లలిత, నిడువిలు వెంకటేశ్వర్లు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 05:11PM