నవతెలంగాణ-గోవిందరావుపేట
వైశ్య రత్న మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య వర్ధంతిని ఆదివారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆర్యవైశ్య సంఘం గోవిందరావుపేట మండల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేసి రోశయ్యకి ఘన నివాళులు అర్పించినారు.
రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిలకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందుపట్ల మచ్చగిరి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపార పరంగానే కాకుండా రాజకీయాలలో రాణిస్తారని అందుకు కొనిజేటి రోశయ్య జీవిత చరిత్ర చక్కటి ఉదాహరణ అని అన్నారు. ముందు ముందు కూడా ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో విశిష్టంగా రాణించి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనగం సురేష్, భూపతి, రాము తదితరులు పాల్గొన్నారు.