నవతెలంగాణ-గాంధారి
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కేశాలంకరణకు (క్షౌరవృత్తి)కి ప్రాచీన చరిత్ర ఉంది. మనుషులను జంతువుల నుండి వేరుచేసిన గొప్ప చరిత్ర ఈ క్షౌరవృత్తికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. కేశాలంకరణ (క్షౌరవృత్తి) మానవుని నాగరికతకు తొలి మెట్టు. భారతదేశంలోకులాలు మరియు మతాలు ఏర్పడిననాటికంటే ముందు నుండి ఈ వృత్తి ఉందని చెప్పడంలో చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. క్షురకర్మ అంటే క్షవరము చేయుట అని అర్ధం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వీరిని నాయీ బ్రాహ్మణులు (మంగలి) అని పిలుస్తుంటారు. భారతదేశంలో క్షౌరవృత్తి వారిని ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క ప్రత్యేక పేర్లతో పిలుస్తుంటారు. హిందూ, సిక్కు మతాలలో వంశపారంపర్యమైనా ఈ వృత్తిని నిర్వహించేవారిని నాయిలుగా పిలుస్తుంటారు. మనిషి పుట్టుక, చావు, దైవ కార్యములకు నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు.
మొదటి వైద్యుడు: చారిత్రక ఆధారాల ప్రకారం క్షౌరవృత్తి దారులే తొలి వైద్యులని, క్షౌరవృత్తి లో భాగంగానే వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిందని, అంతేగాక వైద్యుడి ఆపరేషన్ ప్రారంభానికి ముందు వెంట్రుకలు కత్తిరించడానికి మరియు పుండ్లు, గడ్డలు కోయడానికి కూడా క్షురకర్మ కు వినియోగించే కత్తులు, బ్లెడ్ల్ ఉపయోగించినట్లు ఆధారాలు రుజువుచేస్తున్నాయి.
మొదటి వైద్యురాలు (మంత్రసాని): ఈ వృత్తి మహిళలే స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి శిశు జననం వరకు మంత్రసానిగా సేవలందించేవారు. మంత్రసానిగా సూలగిత్తి నరసమ్మ ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపేలా సేవలందించారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఒక మంత్రసానికి అరుదైన గౌరవం దక్కడం గొప్ప విషయం. అక్షరం రాని మంత్రసానులు ఎలాంటి ఆపరేషన్ లేకుండా సులభంగా కాన్పులు చేసేవారు. కానీ ఇప్పుడు డాక్టర్స్ మాత్రం కత్తెరలేనిదే కాన్పులు చేయటంలేదు. వైద్యరంగం అభివృద్ధి చెందింది కానీ మంత్రసానిలా చేయటంలేదు. ఇప్పుడున్న వైద్యుల కన్నా మంత్రసాని ప్రతిభ గొప్పది. వైద్య రంగం అభివృద్ధి చెందిన తరువాత చాలామంది వైద్యవృత్తిని వదిలి క్షుర వృత్తిమీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
మంగళ వాయిద్యాల ప్రత్యేకత: ప్రాచీన సంప్రదాయాలనుంచి నాయీ బ్రాహ్మణులకు (మంగళి) క్షౌరవృత్తి తో పాటు మంగళ వాయిద్య సంగీతం, వైద్యం కూడా వృత్తిగా ఉండేది. మంగళ వాయిద్య సంగీతంలో వీరు నిష్ట్నాతులు. మంగళ వాయిద్యాలు అంటే నాదస్వరం (సన్నాయి), శృంగభేరి (డోలు) వాయించడం వీరికి ఆనవాయితీగా వస్తుంది. హిందూ దేవాలయాలలో దైవారాధనలో వేదాలకు ఎంత ప్రాధాన్యత వుందో. నాదోపాసనకు అంతే ప్రాధాన్యత ఉంది. నాదోపాసన చేస్తే ఆ పరబ్రహ్మను పూజించినట్లేనన్న విషయం భగవద్గీత పదవ అధ్యాయం పేర్కొంది. 22వ శ్లోకం తెలియచేస్తుంది. నాదోపాసన అనేది ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మంలో అంతర్భాగం. ప్రతి హిందూ దేవాలయంలో, నాదస్వరం వినిపిస్తుంది మరియు దేవుడిని మేల్కొలపడానికి మరియు దైవ ప్రార్థనతో ప్రారంభించడానికి మంగళ వాయిద్యాలను ఉపయోగిస్తారు. భారతదేశంలో మంగళ వాయిద్యాలు లేకుండా ఏ శుభ కార్యమూ జరగదు అనడంలో సందేహం లేదు. వివాహం, కొత్త గృహ ప్రవేశం వంటి శుభకార్యాలకు పూజారి వేద మంత్రాలు ఎంత ముఖ్యమో మంగళ వాయిద్యాలు కూడా అంతే ముఖ్యమైనవి. ముఖ్యంగా మన దేశంలో మంగళ వాయిద్యాల వినియోగం గొప్ప విషయం.
పుణ్యక్షేత్రాలలో నాయీ పాత్ర: అసలు పుట్టువెంట్రుకలు ఎందుకు సమర్పించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలిగించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. దైవ సన్నిధిలో కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి భక్తులు తలనీలాలు సమర్పించడం వంటి కార్యక్రమాల్లో వెంట్రుకలను తొలగించే వారు కేశఖండనకారులు.
భారతీయ సంప్రదాయాల్లో తెలియనివి ఎన్నో ఉంటాయనేది నిర్వివాదాంశం. అందులో పుట్టువెంట్రకులు కార్యక్రమం ఒకటి.
వివాహంలో నాయి పాత్ర: సంప్రదాయబద్ధమైన రీతిలో పెళ్లి మంటపం అలంకరించిన తరువాత మంటపంలో వడ్లుపోసి వాటిపైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి నాయీ బ్రాహ్మణుడు(మంగలి) మైలపోలు తీస్తారు. మైలపోలు అంటే పెళ్లి కుమారుడి కాలి, చేతి గోర్లు మొదలైనవి శుభ్రం చేయటం. పెళ్ళిలో వీరి పాత్ర ముఖ్యమైనదనె చెప్పొచ్చు.
కేశాలంకరణ(క్షౌరవృత్తి): మనిషి పుట్టుక నుండి మరణం వరకు నాయీ బ్రాహ్మణుడు (మంగలి) లేనిదే జీవనం ముందుకు సాగదు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి శుభ్రపరచడం మరియు అందంగా మార్చడం నాయీ బ్రాహ్మణుల (మంగలి) వృత్తిఁ. పుట్టు వెంట్రుకల నుండి మొదలుకొని మనిషి మరణాంతరం చేసే క్షుర కర్మలను నిర్వహించేది కూడా నాయీ బ్రాహ్మణులే. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరికీ సమానంగా సేవలందించే వృత్తి కేశఖండన. మానసిక వత్తిడి, సౌందర్య పోషణ, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి నుండి ఉపశమనం పొందడం కొరకు తైలాల మర్ధన ఎంతగా ఉపయొగపడుతాయో ప్రత్యకంగా చెప్పనవసరంలేదు. ఎంతటివారైనా నాయీ బ్రాహ్మణుడికి తలవంచాలిఁ అనేది నానుడి. క్షవరం చేసే సమయంలో వీరివద్ద తలవంచనిదే క్షౌర పని పూర్తిచేయటం అసాధ్యం. ప్రతి మనిషికి తలవెంట్రుకలు శిరస్సును అందంగా అలంకరించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనిషిని అందంగా తీర్చిదిద్దడంలో నాయీ బ్రాహ్మణుల కళా నైపుణ్యం అనివార్యం.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు ఎక్కువగా ఈ వృతిపైనే ఆధాపడి జీవిస్తున్నాయి. అయితే 2019 లో కరోనా మహమ్మారి ప్రభావంతో వృత్తినే నమ్ముకున్న నాయిల జీవితం ఒక్కసారిగా దారితప్పినట్లైంది. హేయిర్ కటింగ్ సెలూన్ లకు గిరాకీ లు లేక తీవ్రమైన సంక్షోభానికి గురై షాపులకు కిరాయిలు మరియు కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా కార్పొరేట్, ఆన్ లైన్ లో సేవలపేరుతో అర్బన్ క్లాప్ఁ పలు సంస్థలు రావడంతో నాయీ బ్రాహ్మణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని వృత్తులు కనుమరుగైపోయినా వీరు మాత్రం అచంచలమైన ధైర్యంతో వృత్తిని కాపాడుకుంటూనే ఉన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతపడుతున్న తరుణంలో కార్పొరేట్ సంస్థలు నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇతర వృత్తి రాకపోవడంతో, వృత్తిని వదులుకోలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా, వారి కుటుంబాలను ఆదుకునే వారులేక దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.కార్పొరేట్ సంస్థలు ఈ వృత్తి లోకి రావడానికి కారణాలేంటి?
కార్పొరేట్ సంస్థల రాకతో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఏదిఏమైనా వీరి వృత్తిని కాపాడే బాధ్యత మరియు ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను కాపాడవలిసిన బాధ్యత ప్రభుత్వాలదే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 05:23PM