నవతెలంగాణ-రాజంపేట్
రాజంపేట మండలంలో ఆదివారం మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. 10 మంది డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి రాజంపేట మండల వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రజలు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వైద్యుల సలహా మేరకు అవ్వసరమున్న వారికి ఉచిత మందులు కూడా అందించారు. అవసరమున్న వారికి 10 రోజుల తరవాత కంటి అద్దాలు కూడా అందిస్తామని తెలియచేశారు. ఇంత చక్కటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మదన్ మోహన్ ట్రస్ట్ సభ్యులకు, మదన్ మోహన్ మరియు వైద్య బృదనికి రాజంపేట మండల ప్రజలు కృతజ్ఞనతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల అధ్యక్షులు లింగా గౌడ్, షరీఫ్, తూర్పు రాజు, క్రిస్టోఫర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరన్న పటేల్, మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చందర్, కరోత్ విఠల్, కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షురాలు లక్ష్మీ, ఉప సర్పంచ్ మాన్య, కామారెడ్డి జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు అన్వేష్ రావు, ఎల్లారెడ్డి పల్లి తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరిలాల్, తాడ్వాయి మండలం మైనారిటీ అధ్యక్షులు శౌకత్ అలీ, ఎం వై ఎఫ్ సభ్యులు సుభాష్ నాయక్,శేశంకర్ తండా యూత్ కాంగ్రెస్ నాయకులు సుభాష్, శ్రీనివాస్, ప్రకాష్, సంతోష్.. ఇతర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 07:27PM