నవతెలంగాణ-అశ్వారావుపేట
మాజీ ముఖ్య మంత్రి, గవర్నర్, కాంగ్రెస్ నేత కొణిజేటి రోశయ్య వర్ధంతిని ఆదివారం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. బూర్గంపాడు రోడ్ లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద రోశయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల అద్యక్షకార్యదర్శులు కొణిజర్ల ఉమామహేశ్వరరావు, జల్లిపల్లి దేవ రాజ్, పట్టణ అద్యక్షులు కలకోటి లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, వాసవి క్లబ్ మండల అద్యక్షులు శీమకుర్తి సుబ్బారావు, సమయమంతుల మహేశ్వరరావు, కోరుకొండ భోగేశ్వరరావు, మోహన్, ఎస్.వి.టి కొండ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm