నవతెలంగాణ-భిక్కనూర్
ప్రజా జీవితాలకు పెనుముప్పుగా మారినా ఎంఎస్ఎన్ కెమికల్ పరిశ్రమ మూసివేతకు సమిష్టిగా పోరాటం చేయాలని పలువురు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, బీఎస్పీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కాచాపూర్ వీడీసీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. 20 గ్రామాలకు ప్రమాదకరంగా ఉన్నా కెమికల్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయని, ఇప్పటి నుండే పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని, ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి నీరు ఇప్పటికే వ్యర్థ పదార్థాల ద్వారా కలిసి తమవుతున్నాయని తెలిపారు.
కెమికల్ పరిశ్రమ ద్వారా వదులుతున్న వ్యక్తపదార్థాలపై ఇటీవల పరీక్షలు చేయించడం జరిగిందని, దానివల్ల భవిష్యత్తులో పెనుమొప్పు ఉంటుందని సంబంధిత ల్యాబ్ అధికారులు సూచించారని వివరించారు. కాచాపూర్ పెద్ద చెరువులో ఉన్నటువంటి నీరు పూర్తిగా వ్యక్తపదార్థాలతో కలిసితంగా మారాయని, అట్టి నీరు ఎవరు తాగినా ప్రమాదానికి గురవుతారని రిపోర్టులో తేలిందని చెప్పారు. సమిష్టి పోరాటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మల్లు పల్లి ఎంపీటీసీ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా రైతు విభాగం కాంగ్రెస్ కార్యదర్శి లింగారెడ్డి, కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ యాదయ్య, గంగపుత్ర సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 04 Dec,2022 07:32PM