నవతెలంగాణ-వీణవంక
గ్రామపంచాయతీకి చల్లూర్ పెట్రోల్ పంప్ నుండి కాళీ బిల్లులు ఇచ్చి గ్రామపంచాయతీలో అవకతవకలు జరగడానికి సహకరించాడని పంపు చైర్మన్ రఘునాథ రెడ్డి పై ప‌్రజావాణిలో బొంతుపల్లి మాజీ ఉప సర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి కలేక‌్టరుకు ఫిర్యాదు చేశారు. వీణవంక మండలంలోని బొంతుపల‌్లి గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డీజిల్ ఖర్చుపై సహా చట్టం 2005 ప్రకారం డిజిల్ బిల్లులు తీసుకోగా పలు బిల్లులపై అనుమానం రావడంతో పంచాయతీ కార్యదర్శికి మార్చి 19, 2021 రోజున ఫిర్యాదు చేయగా కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ ,సంబంధిత బిల‌్లులు వ‌్రాసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారుడైన చదువు జితేందర్ రెడ్డి జూన్ 10, 2022న లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త ఆదేశం మేరకు 21, సెప్టెంబర్, 2022న విచారణ అధికారి వీణవంక ఎం పీ ఓ గ‌్రామపంచాయితిలో విచారణ జరిపియున్నారు.
అట్టి విచారణలో చల్లూరు గ్రామంలో ఉన్న ఆదర్శ ఫార్మర్ కోపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బంకు వారు ఖాళీ రసీదు (బిల్లులు )ఇచ్చి వ్రాసుకోమన్నారని విచారణ అధికారి శ్రీ ప్రభాకర్ విచారణలో వెల్లడైనట్లు లోకాయుక్తకు నివేదిక సమర్పించారు. మొదటి బిల్లుల స్థానంలో తిరిగి పొంది వ్రాయడం సరైనది కాదని, మ‌్యానిపిలేషన్ గా భావించవచ్చని విచారణ అధికారి నివేదికలో పేర్కొన్నారని అందువలన ఈ విషయం నందు ఆధర‌్శ సహకార పెట్రోల్ బంకు చైర్మన్ గారైన ముదిగంటి రఘునాథ రెడ్డి గారిపై బిల్లుల ఫోర్జరీకి సహకరించినందుకు చైర్మన్ రఘునాథరెడ్డిని బాధ్యులుగా గుర్తించి వారిపై చట్టపరమైన చర్యను తీసుకోవాలని సోమవారం కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో చదువు జితేందర్ రెడ్డి కోరారు.