- ఎండాకాలంలో వడ దెబ్బ బారి నుంచి తప్పించుకునే చల్లని గొడుగు తయారు
నవతెలంగాణ-కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న 50వ రాష్ట్రీయ బాల విజ్ఞాన్ ప్రదర్శన 2022 నిజామాబాద్ జిల్లా స్థాయి పోటీలు స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ విద్యార్థులు 9వ తరగతి విద్యార్థినిలు టీ. పూజ, ఆర్. సౌమ్య శ్రీ పాల్గొన్నారు. వీరు ఎండాకాలం లో వడ దెబ్బ బారి నుంచి తప్పించుకునే చల్లని గొడుగు తయారు చేశారు. ఈ గొడుగు ఎండలో పని నిమిత్తం తిరిగే ముసలి వాళ్ళని వడ దెబ్బ బారి నుండి తప్పించుకునే లా చల్లని గొడుగు ఉపయోగపడుతుంది అని వివరించారు.
వీరు ఎండాకాలం లో వడ గాలుల తాకిడికి చెప్పులు కుట్టే వారు, ట్రాఫిక్ పోలీసులు, వ్యాపార ప్రకటన నిమిత్తం పనిచేసే సిమ్ కార్డ్ సెల్లెర్స్ నీ పండ్ల కూరగాయల వ్యాపారుల నీ ఈ గొడుగు కాపాడి అనారోగ్య పాలవ కుండ చేస్తుంది అని చెప్పారు. దీని కోసం వీరు ఒక గొడుగు తీసుకొని దానికి పైన భాగం లో ఒక కాటన్ గుడ్డ చుట్టారు. ఈ గొడుగు గుడ్డ కాటన్ గుడ్డ మధ్య భాగం లో సెలైన్ పైప్ లు అమర్చారు.ఈ పైప్స్ ద్వారా కింది నుండి నీటిని పంపే అవకాశం ఉంటుంది. గొడుగు కింద సోలార్ ప్యానల్ తో నడిచే ప్రోఫెళ్లర్ ఫ్యాన్స్ అమర్చారు. ఈ ఫ్యాన్స్ గొడుగు పట్టుకున్న మనుషులకు చల్లని గాలి ఇస్తుంది. ఇలా ముసలి వాళ్ళని, చెప్పులు కుట్టే వారు ట్రాఫిక్ పోలీసులు వ్యాపార ప్రకటనలు చేస్తూ ఉండే వారిని, పండ్లని అమ్మే వారిని వడ గాలుల నుండి కాపాడును. వీరికి గైడ్ టీచర్ గా ఫిజికల్ సైన్సెస్ ఉపాధ్యాయుడు సి హెచ్ ముద్దు కృష్ణ వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యయులు గంగయ్య మరియు స్టాఫ్ అందరూ పిల్లలను గైడ్ టీచర్ ను అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 02:11PM