నవతెలంగాణ-కంటేశ్వర్
ఈ.జె.హెచ్. ఎస్ పరిధిలోని వెల్ నెస్ సెంటర్ ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వైద్య కళాశాల వెనుక భాగాన నున్న బిల్డింగులోకి మార్చాలని, పవెల్నెస్ సెంటర్ వెల్ఫేర్ కమిటీ సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కరెక్టరుకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాలుగవ అంతస్థులోకి మార్చటం వలన రిటైర్ అయిన వయోవృద్ధులు, వికలాంగులు, అనేకమంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇప్పుడు ఇచ్చిన వసతి కూడా సెంటర్ నిర్వాహణకు సరిగా లేదని, వైద్య సదుపాయాలు పొందటం సాధ్యం కాదని, ప్రతినిధులు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు.
అడిషనల్ కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేశామని, త్వరలో అన్ని సదుపాయాలతో వసతిని కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. ప్రజావాణిలో రిటైర్డ్ ఉద్యోగుల అధ్యక్షులు రామ్మోహన్ రావు, ఎల్ శ్రీధర్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజలింగం టీచర్స్ యూనియన్ నాయకులు రాజన్న , లింగం, సుదర్శన్ రాజు, క్రిస్టియన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్ట జార్జ్, ఈవీఎల్ నారాయణ, హనుమాన్లు, మదన్ మోహన్, లక్ష్మీనారాయణ, శంకర్, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 02:15PM