నవతెలంగాణ-కంటేశ్వర్
డిసెంబర్ 16,17,18 తేదీలలో హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగే 7వ పురుషుల సీనియర్ రాష్ట్ర స్థాయీ హాకీ పోటీలలో పాల్గొనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు ను ఈనెల తేదీ 7, బుధవారం నాడు ఉదయం 6:00లకు ఆర్మూర్ లోని మినీ స్టేడియం నందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురుషుల సినీయర్ హాకీ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుందని నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు విశాఖ గంగ రెడ్డి , ప్రధాన కార్యదర్శి సదవస్తుల రమణ, కోశాధికారి పింజ సురేందర్ సోమవారం ప్రకటనలో తెలియజేశారు.
ఎంపిక లో పాల్గొనే క్రీడాకారులు జనన ధృవికరణ పత్రం మరియు ఆధార్ కార్డు విధిగా వెంట తెచ్చుకోవాలని తెలియజేశారు. క్రీడాకారులు అందరు కూడా బుధవారం ఉదయం 60:00 గంటల లోపు ఆర్మూర్ మినీ స్టేడియం నందు కోచ్ జావిద్, సంఘ బాధ్యులు చిన్నయ్య నాగేష్ సంతోష్ ఠాకూర్, అంజు, ను రిపోర్ట్ చెయ్యగలరు. క్రీడాకారులు సమాచారం కోసం9848426821, 9642535535 నంబర్లకు సంప్రదించాలని కోరారు.