- ఆరోగ్య కేంద్ర సిబ్బందికి వైద్యాధికారి సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
చిన్నారులకు సంక్రమిస్తున్న న్యూమోనియా వ్యాధి నివారణకు ప్రత్యేక దృష్టి సారించి కృషి చేయాలని మండల వైద్యాధికారి వినోద్ బాబ్జీ ఆరోగ్య కేంద్ర సిబ్బందికి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానకుక ఎంపీడీఓ సమావేశ కార్యాలయంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలకు న్యూమోనియా వ్యాధి లక్షణాలు, చికిత్సకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సుమారు 15 శాతం మంది చిన్నారులు న్యూమోనియా వ్యాధి బారిన పడుతున్నారని గ్రామాల్లోని ఆశా కార్యకర్తలు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యాధికారి వినోద్ బాబ్జీ తెలిపారు. యునాని వైద్యాధికారి నషీమున్నిసా తహాసీన్, సూపర్ వైజర్ సులోచన, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 04:03PM