- సిపిఐ మాజీ ఎమ్మెల్యే పోతరాజు
నవతెలంగాణ-ధర్మసాగర్
నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే పోతరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ధర్మసాగర్ మండల సిపిఐ పార్టీ బట్టు మల్లయ్య ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముట్టడించి,డిప్యూటీ తాసిల్దార్ రోజా రాణి కి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పెద్ద పెండ్యాల గ్రామ శివారులోని సర్వేనెంబర్ 898/1లో దాదాపు ప్రభుత్వ భూమి 21 ఎకరాల 33 గుంటల ప్రభుత్వభూమి ఉన్నదని, నిరుపేదలైన మండలానికి చెందిన దాదాపు 500 కుటుంబాల ప్రజలు ఇళ్ల స్థలాల కోసం డబుల్ బెడ్ రూమ్ పథకంకు అమలు కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యేకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలను సమర్పించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చ లేదని గుర్తు చేశారు.ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,మంత్రిలకు ఎన్ని వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు వెంటనే ఇల్లా స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ లేనిపక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సిపిఐ కార్యదర్శి కర్రే బిక్షపతి, సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, ఆధార్ శ్రీనివాస్, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు జక్కుల రాజు గౌడ్, మాలోత్ శంకర్, రసమల్ల దీన, రాజారపురత్నం, కొట్టే ప్రభాకర్, మునిగాల ప్రభాకర్, చిలుక దేవదాస్, వందలాది మంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 04:07PM