నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్ధార్ సింగ్ పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చందాలతో గెలిచి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి జెండామోసిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. టిఆర్ఎస్ పార్టీకి 75 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే సురేందర్ మదన్ మోహన్ రావుకి ప్రజలలో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక తన అనుచరులతో మదన్ మోహన్ చేస్తున్న ఆర్థిక సహాయం పై నిందలు వేస్తూ ఎమ్మెల్యే సురేందర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాము అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి తెచ్చిన డబ్బులలో ఏ ఒక్క కార్యకర్త కానీ నియోజకవర్గ ఓటరు ఎవరికైనా నీ సొంత డబ్బులతో ఆదుకున్నావా దీనికి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గెలవకముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత అని, ఎన్నికల సమయంలో నువ్వు సమర్పించిన పత్రాల్లో నీ ఆస్తి వివరాలు ఎంత అని ఇప్పుడు నీ ఆస్తి ఎంతో నియోజకవర్గ ప్రజలు తెలపాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో మదన్ మోహన్ రావు నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని నాయకులు సర్దార్ సింగ్, మేడిపల్లి సీనియర్ నాయకులు కిషన్, కరక్ వాడి అధ్యక్షులు ఉమ్మజి భాస్కర్ రావు, MYF సోషల్ మీడియా ఇంచార్జి
బామన్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Dec,2022 05:25PM